టి20 ప్రపంచకప్‌లో షకీబ్ అరుదైన రికార్డు
- October 24, 2021
షార్జా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ టి20 ప్రపంచకప్‌లో అరుదైన ఘనత సాధించాడు. టి20 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో షకీబ్ అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో షకీబ్ నిస్సాంకాను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా షకీబ్ 40వ వికెట్ సాధించాడు. ఈ వికెట్‌తో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న 39 వికెట్ల రికార్డును దాటేశాడు. కాగా అవిష్క ఫెర్నాండోను బౌల్డ్ చేయడం ద్వారా 41వ వికెట్ సాధించిన షకీబ్ ఓవరాల్‌గా తొలి స్థానంలో నిలవగా.. షాహిద్ అఫ్రిది 39 వికెట్లతో రెండో స్థానం, లసిత్ మలింగ 38 వికెట్లతో మూడో స్థానంలో.. సయీద్ అజ్మల్ 36 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మహ్మద్ నయీమ్(52 బంతుల్లో 62; 6 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్(37 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. అనంతరం చేధనలో లంక పోరాడుతుంది. 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అసలంక 65, రాజపక్స 45 పరుగులతో ఆడుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







