దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ రికార్డ్ స్థాయిలో విజిటర్స్
- October 28, 2021
దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 లో ఇండియన్ పెవిలియన్ దుమ్ము రేపుతోంది. ఇండియా ఏర్పాటు చేసిన పెవిలియన్ కు భారీగా విజటర్స్ వస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 25 తేదీ నాటికే దాదాపు లక్షా 28 వేల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శించారు. దీనిపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ గణాంకాలు ప్రపంచ వ్యాప్తంగా భారత్ పై ఎంతో ఆదరణ ఉందో నిరూపిస్తుందన్నారు. న్యూ ఇండియా పయనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుంటున్నారని చెప్పారు. ఈ ఎక్స్ పో మరో 5 నెలలుగా కొనసాగనుంది. అప్పటి వరకు దాదాపు 8 నుంచి 10 లక్షల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక దుబాయ్ ఎక్స్ పో ను ఇప్పటి వరకు 15 లక్షల మంది విజిట్ చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్