'ఆర్ఆర్ఆర్' నుంచి కనీవినీ ఎరుగని సర్ప్రైజ్
- October 28, 2021హైదరాబాద్: టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. దేశం మొత్తం ఆతృతగా ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తోంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు, అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఇచ్చిన తాజా అప్డేట్ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచేసింది. “ఈ అక్టోబర్ 29న ప్రపంచంలోని ఏ చిత్రానికి ఇంతకు ముందెన్నడూ చూడని, వినని కొలాబరేషన్ ను చూడటానికి సిద్ధంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశారు “ఆర్ఆర్ఆర్” టీం. అయితే అక్టోబర్ 29న రానున్న అప్డేట్ ఏమిటన్న విషయంపై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే అక్టోబర్ 29 వరకు వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..