దుబాయ్ ఎక్స్ పో లో అదిరిపోయేలా దీపావళి ఉత్సవాలు
- October 28, 2021
దుబాయ్: దీపావళి ఉత్సవాలను ఈసారి అదిరిపోయేలా నిర్వహించనున్నట్లు ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (FOI) ఈవెంట్స్ తెలిపింది. గత దశాబ్దాకాలంగా (FOI) ఈవెంట్స్ సంస్థ ఘనంగా దీపావళి మహోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈసారి దుబాయ్ ఎక్స్ పో -2020 ఈవెంట్ ను ఇందుకు వేదికగా మార్చారు. ప్రపంచ దేశాల వారు ఈ ఎక్స్ పో కు వస్తుండటంతో దీపావళి వైభవాన్ని చాటేందుకు ఇక్కడ పండుగ ఉత్సవాలను ఘనంగా ప్లాన్ చేశారు. ఇండియన్ పెవిలియన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీపావళి మహోత్సవాలు జరగనున్నాయి. ఇండియన్ కాన్సులేట్ జనరల్, PIOCCI సహకారంతో దుబాయ్ ఎక్స్ పో లో దీపావళి ఔనత్యాన్ని చాటే విధంగా మహోత్సవాలు చేస్తున్నారు. భారత కాన్సులేట్ జనరల్ తో పాటు ఇండియన్ ఎంబసీ ఉన్నతాధికారులు, దుబాయ్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉత్సవాల్లో భాగంగా దీపావళి వైభవాన్ని చాటటంతో పాటు ఇండియాలోని పలు రాష్ట్రాల సంస్కృతిని చాటే కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
రెండు చోట్ల వేడుకలు...
ఎక్స్పో లోని రెండు చోట్ల వేడుకలు జరగనున్నాయి. భారత పెవిలియన్ లోని అంఫీ థియేటర్ లో పలు సంస్కృతిక, నృత్య కార్యక్రమాలు జరగుతాయి. దుబాయ్ ఎక్స్ పో మిలినియం అంఫీ థియేటర్ లో పలు రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు, భారత సంప్రదాయాల ఆటలను ఆడించనున్నారు. అదే విధంగా వర్చువల్ గా రంగోలి కాంపిటేషన్ ను కూడా నిర్వహిస్తారు. భారత పెవిలియన్ అంఫీ థియేటర్, దుబాయ్ మిలినియం అంఫీ థియేటర్ రెండింటిలోనూ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు థియేటర్లు పక్కపక్కనే ఉంటాయన్నారు.
ఎంట్రీ టికెట్ ఉండాల్సిందే...
వేడుకల ప్రారంభానికి ముందు యూఏఈ పోలీసు బ్యాండ్ నిర్వహించనుంది. రెండు దేశాల జాతీయ గీతాల ఆలాపనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉత్సవాలకు హాజరు కావాలనుకునే వారికి దుబాయ్ ఎక్స్ పో ఎంట్రీ టికెట్ లేదా పాస్ ఉండాల్సిందే. అదే విధంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని ఎక్స్ పో అధికారులు రూల్ పెట్టారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్