ఫేస్‌బుక్ పేరు మార్పు…

- October 29, 2021 , by Maagulf
ఫేస్‌బుక్ పేరు మార్పు…

అమెరికా: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్ పేరును మార్పు చేశారు. “మెటా” గా పేరును మారుస్తూ ఫేస్‌బుక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్  తాజాగా కీలక ప్రకటన చేశారు.

త్వరలోనే సీఈవో పదవీ బాథ్యతల నుంచి తాను త్వరలో తప్పుకోనున్నట్టు సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఫేస్బుక్ అనుబంధ మాధ్యమాలు అయిన ఇన్స్ట్రాగ్రామ్, వాట్సప్ కూడా ముందు ముందు పేరు మార్పులతో పాటుగా మరిన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఫేస్‌బుక్ వ్యాపార కార్యకలాపాలపై అమెరికా ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఇబ్బందులు పెరుగుతున్న నేపధ్యంలో కంపెనీ పేరు మార్పు జరగటం ఆసక్తి రేపుతోంది. వివాదాలు తలెత్తిన ప్రతిసారీ ఫేస్‌బుక్ పేరు వార్తల్లోకెక్కడం వల్ల యూజర్ల సంఖ్యపై విపరీతమైన ప్రభావం చూపిస్తోందని కంపెనీ భావన. అందుకే కొత్త పేరుతో రీబ్రాండ్ చేయటం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుందనేది కంపెనీ ఆలోచనగా భావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫేస్‌బుక్ అంటే కేవలం సోషల్ మీడియా అనే అభిప్రాయాన్ని తొలగించుకున్నట్లు అవుతుందనేది ఆ సంస్థ ఆలోచన.. ఈ పేరు మార్పుతో యూజర్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు అని జుకర్‌బర్గ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com