క్యాంపింగ్ సైట్ సమీపంలో టెంపరరీ కో అపరేటివ్ మార్కెట్లు..!
- October 29, 2021
కువైట్: క్యాంపింగ్ సైట్ సమీపంలో తాత్కాలిక సహకార మార్కెట్ లను ఏర్పాటు చేసేందుకు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. యాన్యువల్ క్యాంపింగ్ సీజన్‌ను ప్రారంభించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ మేరకు స్టడీ జరుగుతున్నట్లు అల్-జరిదా దినపత్రిక తన కథనంలో పేర్కొంది. కొన్ని సహకార సంస్థలదే గుత్తాధిపత్యం కొనసాగుతోంది. దీన్ని నిరోధించడం కోసమే ప్రభుత్వం అన్ని సహకార సంఘాలకు తాత్కాలిక మార్కెట్ లను ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు కేటాయించనున్నట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కువైట్ మున్సిపాలిటీ సమన్వయంతో లాటరీ విధానంలో వీటికి స్థలాలను కేటాయిస్తారు. మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల సహకార సంఘాల సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ మీటింగ్ లోనే టెంపరరీ మార్కెట్ల ఏర్పాటు నిర్ణయం గురించి అన్ని సహకార సంఘాలకు తెలియజేయాలని సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..