ట్రాఫిక్ జరిమానాలపై అభ్యంతరాలుంటే నెలరోజుల్లోపు చెప్పొచ్చు

- October 29, 2021 , by Maagulf
ట్రాఫిక్ జరిమానాలపై అభ్యంతరాలుంటే నెలరోజుల్లోపు చెప్పొచ్చు

అబుదాబి: ట్రాఫిక్ జరిమానాలపై నెలరోజుల్లోపు వాహనదారులు అభ్యంతరం చెప్పొచ్చని అబుదాబి పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఫైన్ కు సంబంధించిన SMS అందిన తేదీ నుండి ఒక నెలలోపు డ్రైవర్లు, వెహికిల్ ఓనర్లు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ట్రాఫిక్ నియంత్రణ నియమాలు, విధానాలపై 2017 మంత్రివర్గ తీర్మానం నెం.178 ఆధారంగా.. వెహికిల్ ఓనర్/డ్రైవర్ తన వాహనంపై విధించిన జరిమానాలపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. వాహనదారుల అభ్యంతరాలను పరిశీలిస్తామని సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్‌లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ అల్ హుమైరీ చెప్పారు. "నిర్దిష్ట వ్యవధిలో మాత్రమే వాహన యజమాని తప్పుగా జరిమానా విధించారని క్లెయిమ్ చేయవచ్చు. ఆ తర్వాత కచ్చితంగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందగానే సంబంధిత అధికారులు తనిఖీ చేస్తారు. తప్పుగా ఫైన్ విధించి ఉంటే దాన్ని రద్దుచేస్తారు. లేదంటే ఉన్న ఫైన్ నే ఖరారు చేస్తారు." అని బ్రిగేడియర్ మహమ్మద్ అల్ హుమైరీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com