బాలయ్య షో కు భలే డిమాండ్

- October 29, 2021 , by Maagulf
బాలయ్య షో కు భలే డిమాండ్

వెండితెరపై తన నటన, వాక్‌ చాతుర్యంతో అద‌ర‌గొట్టిన బాల‌కృష్ణ ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షో కోసం హోస్ట్‌గా మార‌బోతున్న విష‌యం తెలిసిందే .ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తూ వినోదం పంచనున్నారు. ఇప్ప‌టి వ‌రకు ఎవ‌రికి తెలియ‌ని విష‌యాల‌ను ఈ షో ద్వారా బ‌య‌ట‌కు తీయ‌నున్నారు బాల‌య్య‌. ఇటీవ‌ల సెట్‌లో బాలకృష్ణతో మోహన్‌బాబు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీంతో షోకి తొలి గెస్ట్ ఆయ‌నే అని అర్ధ‌మైంది.

మరోవైపు, మెగా కుటుంబం నుంచి నాగబాబు ఈ షోలో పాల్గొన్నారని టాక్‌ వినిపిస్తోంది.సెకండ్ గెస్ట్ ఆయనే అని అంటున్నారు. ఆ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని ఈ షోకు హాజ‌రు కానున్నాడ‌ట‌. ఆయ‌న త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, ప‌లువురు మెగా హీరోలు షోలో సంద‌డి చేయ‌నున్నార‌ట‌. నవంబ‌ర్ 4 నుండి షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు అన్‌స్టాప‌బుల్ టాక్ షో కోసం బాల‌కృష్ణ దాదాపు రూ.5కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌. అంటే ఎపిసోడ్‌కు న‌ల‌బై ల‌క్ష‌లు చొప్ప‌న రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. తొలి సీజ‌న్‌లో 12 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే మొత్తంగా చూస్తే రూ.4.8 కోట్లు రెమ్యున‌రేష‌న్ ద‌క్కుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com