ఇటలీలో జరిగే జీ-20 సమావేశానికి వెళ్లిన ప్రధాని మోదీ

- October 29, 2021 , by Maagulf
ఇటలీలో జరిగే జీ-20 సమావేశానికి వెళ్లిన ప్రధాని మోదీ

రోమ్: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి నవంబర్ 2 వరకు విదేశాల పర్యటనలో ఉండనున్నారు. ఇటలీ, యుకేలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుంది. ఇటలీలో 16వ జీ 20 సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా మోదీ ఇటలీ చేరుకున్నారు.ఇటలీ, బ్రిటన్ లో ఆయన ఐదు రోజులపాటు పర్యటించనున్నారు.

ఇటలీలో నేటి నుంచి అక్టోబర్ 31 వరకు పర్యటించున్నారు.అక్టోబర్ 31న రోమ్ వేదికగా జీ-20 సదస్సు జరుగనుంది. జీ-20 సదస్సులో మోదీ పాల్గొంటారు. కరోనాతో పాటు (Covid-19) భవిష్యత్ లో వచ్చే వ్యాధులను ఎదుర్కోవడంపై చర్చ జరగనుంది. కరోనా అనంతర పరిస్థితులపైనా జీ-20 సదస్సులో చర్చించనున్నారు.

రోమ్ లో పలు అంతర్జాతీయ నేతలతో మోదీ భేటీ కానున్నారు. వాటికన్ లో పోప్ ఫ్రాన్సిస్ తో మోదీ సమావేశం ఉంటుంది. నవంబర్ 1, 2 తేదీల్లో బ్రిటన్ లో ప్రధాని మోదీ పర్యటిస్తారు. గ్లాస్గో వేదికగా జరిగే కాప్ - 26 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. వాతావరణ, పర్యావరణ మార్పులపై కాప్ - 26 సదస్సులో చర్చ జరుగనుంది.

ఇక ఇప్పటికే రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఈ మధ్యాహ్నం వెన్యూ పియాజా గాంధీ ప్రాంతంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత రాత్రి ఇటలీ ప్రధాని మారియో డ్రాగీతో సమావేశమవుతారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు వాటికన్‌ సిటీలో జరగబోయే జీ20 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌, ఇండోనేషియా, సింగపూర్‌, జర్మనీ దేశాధినేతలతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ కానున్నారు. తర్వాత మోదీ నేరుగా యూకే వెళ్లి కాప్‌ 26 సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బోరిస్‌తోనూ ప్రధాని భేటీ కానున్నారు. పర్యటన ముగించుకుని నవంబరు 3వ తేదీ ఉదయానికి తిరిగి దిల్లీ చేరుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com