ఖతార్ లో కర్ణాటక సంఘ్ అధ్యక్షుడ నగేష్ రావు మృతి
- October 30, 2021
దోహా: ఖతార్ లో దాదాపు 32 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రవాస భారతీయుడు, ఖతార్ లో కర్ణాటక సంఘ్ అధ్యక్షుడు నగేష్ రావు మరణించారు. 60 ఏళ్ల ఆయన దోహాలో ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ కు తీసుకెళ్లే లోగా ఆయన చనిపోయారు. ఆయన మరణవార్త తెలియగానే ఖతార్ లోని కర్ణాటక వాసులంతా సంతాపం వ్యక్తం చేశారు. 32 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఖతార్ వచ్చిన ఆయన కష్టపడుతూ మంచి స్థాయికి వచ్చారు. హోల్ సేల్ ఫార్మసీ కంపెనీ అయిన అల్ షార్క్ ట్రేడింగ్ లో మేనేజర్ ఉన్నారు. కర్ణాటక సంఘ్ అధ్యక్షుడిగా ఎంతో మంది కన్నడిగులకు ఖతార్ లో ఏ ఆపద వచ్చిన ఆదుకున్నారు. నగేష్ రావుకు భార్య అనురాధ ఎన్ రావు, కుమారుడు ఆశిష్ ఎన్ రావు, కుమార్తె ఐశ్వర్య ఎన్ రావు ఉన్నారు. ఖతార్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఆదివారం నాటికి భారత్ కు తరలించనున్నారు. నగేష్ రావు మృతిపై సౌత్ ఇండియాలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రవాసుల ఫోరమ్ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్