వరల్డ్ ఎక్స్ పో -2030 రేసులో సౌదీ

- October 30, 2021 , by Maagulf
వరల్డ్ ఎక్స్ పో -2030 రేసులో సౌదీ

రియాద్: వరల్డ్ ఎక్స్ పో-2030 రేసులోకి సౌదీ అరేబియా వచ్చి చేరింది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎక్స్ పోను నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సౌదీ తెలిపింది. బ్యూరో ఇంటర్నేషనల్ ఎక్స్ పోజిషన్స్ (BIE), వరల్డ్ ఎక్స్ పో ఆర్గనైజింగ్ బాడీ లకు తాము ఈ ఎక్స్ పో నిర్వహణకు ఆసక్తిగా ఉన్నట్లు లెటర్ కూడా పంపింది. ఈ విషయాన్ని సౌదీ యువరాజ్ స్వయంగా తెలిపారు. రానున్న రోజుల్లో ఆయిల్ ఎక్స్ పోర్ట్స్ పై ఆధారపడటం తగ్గించి మిగతా రంగలపై ఫోకస్ చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సౌదీ ప్రభుత్వం ఆ దిశగా వ్యుహాత్మకంగా ఇప్పటి నుంచే పనిచేస్తోందన్నారు. పబ్లిక్ సెక్టార్, హెల్త్, ఎడ్యుకేషన్, మౌలిక వసతుల కల్పన పై మరింత దృష్టి పెడతామని చెప్పారు. 2030 నాటికి ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయని సౌదీ ప్రిన్స్ చెప్పారు. వరల్డ్ ఎక్స్ పో 2030 ద్వారా ప్రపంచ దేశాలకు సౌదీ లో వ్యాపార విస్తరణకు ఉన్న అవకాశాలను వివరిస్తామని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com