వింటర్ ఫ్లూ వ్యాక్సినేషన్ కు రిజిస్ట్రేషన్స్ షురూ
- October 30, 2021
కువైట్: చలికాలం లో వచ్చే సీజనల్ వ్యాధులు, ఫ్లూ జ్వరాల నివారణకు ఇచ్చే వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టార్ట్ చేసింది. 30 ఏళ్లకు పైబడిన వారంతా ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ సూచించారు. హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ లో లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అదే విధంగా ఈ నెల 30 న మిష్రెఫ్ ఏరియాలోని కువైట్ సెంటర్ లో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఏ కారణం చేతనైనా రెండో డోస్ తీసుకోనివారికి ఇక్కడ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న గ్రూప్ లకు సంబంధించి మూడో డోస్ కూడా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వింటర్ డిసీస్ క్యాంపెయిన్, వ్యాక్సినేషన్ తో కార్యక్రమంలో భాగంగానే కరోనా మూడో డోస్ ను కూడా ఇస్తామని డాక్టర్ అబ్దుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!