అంతర్జాతీయ విమాన సర్వీసులపై మళ్లీ నిషేధం పొడిగింపు..
- October 30, 2021
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నవంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ కొనసాగుతుందని శుక్రవారం డీజీసీఏ(DGCA) వెల్లడించింది.అయితే, వందే భారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద నడుస్తున్న ప్రత్యేక ఇంటర్నెషనల్ విమాన సర్వీసులు యధావిధిగా పని చేస్తాయని డీజీసీఏ ప్రకటించింది. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గత ఏడాది మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020 మే మొదటి వారం నుంచి వందే భారత్ మిషన్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంపిక చేసిన దేశాల నుంచి విమాన సర్వీసులు నడిపిస్తోంది.
అలాగే ఇదే ఏడాది జూలై నుంచి భారత్ కొన్ని దేశాలతో 'ఎయిర్ బబుల్' ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా సుమారు 28 దేశాలతో భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఆయా దేశాల నుంచి ఇండియాకు ప్రత్యేక నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా పొడిగించిన నిషేధం కారణంగా అంతర్జాతీయ కార్గో విమానాలతో పాటు ఇతర కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించిన వాటిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని DGCA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..