సౌదీ పెవిలియన్: రికార్డ్ స్థాయిలో 5 లక్షల విజిటర్స్ సందర్శన

- October 31, 2021 , by Maagulf
సౌదీ పెవిలియన్: రికార్డ్ స్థాయిలో 5 లక్షల విజిటర్స్ సందర్శన

దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో -2020 సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అన్ని దేశాల పెవిలియన్ల కు చాలా మంది విజిటర్స్ వస్తున్నారు. ఐతే సౌదీ అరేబియా పెవిలియన్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. లక్షలాది మంది ఈ పెవిలియన్ ను సందర్శిస్తున్నారు. నెల రోజులు కూడా గడవకముందే రికార్డ్ స్థాయిలో 5 లక్షల మంది విజిట్ చేశారు. వరల్డ్ వైడ్ ఈవెంట్ లో ఈ స్థాయిలో సౌదీ పెవిలియన్ ను సందర్శించటం ఒక రికార్డ్ అని అధికారులు తెలిపారు.యూఏఈ దేశాలతో పాటు ఇతర దేశాల ప్రజలు, డెలిగేట్స్ తమ పెవిలియన్ ను విజిట్ చేసి..సౌదీ చరిత్రను, ఇక్కడ వ్యాపార అవకాశాల గురించి ఆరా తీస్తున్నారని అధికారులు వివరించారు. మరో ఐదు నెలల పాటు ఎక్స్ పో కొనసాగుతుంది. ఈ ఎక్స్ పో ముగిసే నాటికి 25 లక్షల మంది సౌదీ పెవిలియన్ ను విజిట్ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com