'సర్కారు వారి పాట' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..

- November 03, 2021 , by Maagulf
\'సర్కారు వారి పాట\' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు.

పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు. మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం.

వచ్చే ఏడాది అంటే..ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నట్లు అఫిషీయల్‌ గా ప్రకటించింది చిత్ర యూనిట్‌. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది. కాగా.. గతంలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వరుసగా సినిమా ఉండటంతో.. ఏప్రిల్‌ కి షిఫ్ట్‌ అయింది సర్కారు వారి పాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com