పాటశాలలో పెరిగిన ఫీజుల భారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

- March 21, 2016 , by Maagulf
పాటశాలలో పెరిగిన ఫీజుల భారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

 ఒమన్ భారతీయ పాఠశాలలో వచ్చే నెల ( ఏప్రిల్ ) నుంచి భారీగా ఫీజుల మోత మోగనుంది. ట్యూషన్ ఫీజు ఏప్రిల్ నుండి పెంచాలని యాజమాన్యం నిర్ణయించడం పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు విస్తుపోతున్నారు. ఈ ఆకస్మిక చర్య పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పాఠశాలలు ఫీజు పెంచడానికి భారతీయ పాఠశాల సంస్థ  పచ్చజెండా ఊపడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని జీతభత్యాలతో జీవన ఖర్చులు విపరీతంగా పెరగడంతో వారు ఈ ఫీజుల పెంపును స్వాగతించలేక ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ సందర్భంగా విధ్యార్దుల తల్లిదండ్రులలో  కొందరు ఒమన్ టైమ్స్ తో మాట్లాడుతూ, తాజాగా పెరగనున్న  ఫీజుల పెంపు ఎంతో అన్యాయం అని అన్నారు. ఈ కారణంగా తమ ఆర్ధిక ఖాతాలోకి ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన చెందారు. ఇది తమకు కోలుకోలేని ఒక పెద్ద దెబ్బ అని అన్నారు. ఒమాన్ ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉండటం వలన పొదుపు చర్యలు అధికమయ్యాయని దీంతో ఉద్యోగులకు జీతాల పెరుగుదల బోనస్ మరియు అనేక ఇతర ప్రోత్సాహకాలు నిరాకరించబడుతున్నాయని తెలిపారు, ఆర్ధిక లోటుతో ప్రభుత్వం కుంటి నడక నడుస్తున్న సమయంలో ఫీజుల భారం మాకు ఒక పెద్ద ఇబ్బంది అని  పిల్లల ఐఎస్ఎం అధ్యయనాలు మనోజ్ బాలకృష్ణన్ నాయర్ చెప్పారు. పెరిగిన కొత్త ఫీజు ప్రకారం ఏడాదికి 48 ఒమాన్ రియాళ్ళను అదనంగా చెల్లించాల్సి ఉంది. ఒమన్ లో పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని , వారి ప్రధాన ధ్యేయం విద్యను అందించడం కాక లాభాలే లక్ష్యంగా నడపబడుతున్నాయని విద్యార్ధుల తల్లిదండ్రులలో ఒకరు వాఖ్యానించారు. వచ్చే ఏప్రిల్  నెల నుంచి తాము నెలకు 36,000 ఒమాన్ రియాళ్ళను ఫీజుగా చెల్లించుకోవాలని వారు మండిపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com