బెస్ట్‌ సస్టెయినబిలిటీ ప్రాక్టీసెస్‌ విభాగంలో గోల్డ్‌ అందుకున్న ఎల్‌&టీ మెట్రో రైల్‌

- November 08, 2021 , by Maagulf
బెస్ట్‌ సస్టెయినబిలిటీ ప్రాక్టీసెస్‌ విభాగంలో గోల్డ్‌ అందుకున్న ఎల్‌&టీ మెట్రో రైల్‌

హైదరాబాద్‌: ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణా స్టేట్‌ ఇండస్ట్రీ అవార్డులు 2021 వద్ద గోల్డ్‌ అవార్డు (విభాగంలో అత్యుత్తమం)ను బెస్ట్‌ సస్టెయినబిలిటీ ప్రాక్టీసెస్‌ విభాగంలో అందుకుంది.ఈ అవార్డుల కార్యక్రమాన్ని  తెలంగాణా స్టేట్‌ గ్లోబల్‌లింకర్‌ నిర్వహించగా, ముఖ్య అతిథిగా తెలంగాణా రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, పురపాలక వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమలు,వాణిజ్య శాఖామాత్యులు కె.టి. రామారావు విచ్చేశారు. ఆయన నుంచి ఈ అవార్డును ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ అండ్‌ సీఈవో కెవీబీ రెడ్డి అందుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర  ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, పరిశ్రమలు,వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ గుర్తింపును అందుకోవడం గురించి ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌ ఎండీ అండ్‌ సీఈవొ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ గుర్తింపును అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు-వాణిజ్య శాఖతో పాటుగా సీఐఐ, తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్‌లకు ధన్యవాదాలు.సస్టెయినబల్‌ వ్యాపార కార్యకలాపాల పట్ల మా నిబద్ధతకు ఈ అవార్డు ఓ నిదర్శనం.హైదరాబాద్‌ నగరంలో  స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల ప్రయాణ అవకాశంగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నిలుస్తుంది. నగర ప్రజా రవాణా వ్యవస్థగా,మేము ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించి, కర్బన ఉద్గారాల విడుదల తగ్గిస్తున్నాం.పర్యావరణ అనుకూల కార్యకలాపాలైనటువంటి  సౌర విద్యుత్‌ వినియోగం,  రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, జీరో వాటర్‌, ఉద్గారాల విడుదల వ్యవస్థలను మా డిపోల వద్ద వినియోగిస్తున్నాం’’ అని అన్నారు.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తమ గ్రీన్‌ కార్యక్రమాలలో భాగంగా నగరంలోని తమ రెండు మెట్రో డిపోలలో 8.35 మెగావాట్‌ పవర్‌ సోలార్‌ ప్లాంట్‌లతో పాటుగా 28 మెట్రో స్టేషన్‌ల వద్ద రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటుచేసింది. 20–21ఆర్ధిక సంవత్సరంలో తమ విద్యుత్‌ అవసరాలలో 17.5% ఈ సోలార్‌ ప్లాంట్‌ల ద్వారానే సమకూర్చుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com