6 నెలలకు మించి UAE బయట ఉండేందుకు అనుమతించిన ఆరు కేటగిరీలు ఇవే..
- November 09, 2021
యూఏఈ: UAE నుండి చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ వీసాను కలిగి ఉండి, ఏ కారణం చేతనైనా విదేశాలకు వెళ్లాలనుకునే రెసిడెంట్ ప్రవాసుడు ఆరు నెలలకు మించి UAE వెలుపల ఉండకూడదని ది ఎమిరేట్స్ డిజిటల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఒకవేళ ఆరు నెలల్లో తిరిగి రాకుంటే వాళ్ల వీసా చెల్లుబాటు కాదని తెలిపింది. అలాంటి వారు కొత్త ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వరకు వారు UAEలోకి ప్రవేశించలేరని స్పష్టం చేసింది. రెసిడెన్స్ వీసా హోల్డర్లు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు UAE వెలుపల ఉండడానికి అనుమతించిన 6 కేటగిరీ వివరాలను ప్రభుత్వం తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
మినహాయింపులు వీరికే..
1. తన ఎమిరేట్ భర్తచే స్పాన్సర్ చేయబడిన విదేశీ భార్య.
2. చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన ప్రభుత్వ సంస్థ కార్మికులు (ఆరోగ్యం, నివారణ మంత్రిత్వ శాఖ ఆమోదించిన మెడికల్ సర్టిఫికేట్ లేదా ఇతర ఆమోదించబడిన ఆరోగ్య అధికారులు జారీ చేసిన సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి)
3. విదేశాల్లో చదువుతున్న స్టూడెంట్, విదేశాల్లో చికిత్స పొందుతున్న వ్యక్తితో పాటు ఉన్న అటెండర్.
4. విదేశాలలో యుఎఇకి ప్రాతినిధ్యం వహించే దౌత్య, కాన్సులర్ మిషన్‌ల సభ్యులతో పాటు వారి సర్వెంట్స్.
5. శిక్షణ లేదా ప్రత్యేక కోర్సులకు హాజరు కావడానికి వెళ్లిన ప్రభుత్వ రంగ ఉద్యోగులు, విదేశాల్లోని కార్యాలయాల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు.
6. విదేశీ యూనివర్సిటీ లలో చదువుకోవడానికి వెళ్లే రెసిడెంట్ స్టూడెంట్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!