సైట్ వర్కర్స్ కోసం ప్రీ వాటర్ స్కీం ప్రారంభించిన కువైట్ ఫుడ్ బ్యాంక్
- November 09, 2021
కువైట్: కువైట్ పుడ్ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ మరొక సేవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైట్ లలో పనిచేసే కార్మికులకు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ చేయనుంది. అవ్ కఫ్ పబ్లిక్ ఫౌండేషన్ తో కలిసి ఈ కొత్త సేవ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా సైట్లలో పనిచేసే వర్కర్స్ కు చల్లని మంచి నీరు ఉచితంగా లభిస్తుంది. వర్క్ ప్లేస్ లలో ఉండే వర్కర్స్ మాత్రమే కాకుండా మసీదులు, హాస్పిటల్స్, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఉచితంగా వాటర్ అందించనున్నారు. ఉచిత వాటర్ సప్లయ్ స్కీం ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని చారిటీ వైస్ చైర్మన్ మెషల్ అల్ అన్సారీ చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ ప్రయత్నిస్తుందన్నారు. అటు అవ్ కఫ్ పబ్లిక్ ఫౌండేషన్ వారు వాటర్ సప్లయ్ చేసేందుకు వాలంటీర్ల సేవలను అందించనున్నారు. ఫ్రీ వాటర్ సప్లయ్ కారణంగా వేలాది మంది వర్కర్స్ కు మేలు జరగనుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!