2026 నాటికి గ్లోబల్ టూరిస్ట్ హబ్ గా బహ్రెయిన్

- November 09, 2021 , by Maagulf
2026 నాటికి గ్లోబల్ టూరిస్ట్ హబ్ గా బహ్రెయిన్

బహ్రెయిన్:ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం టూరిజం పై దృష్టి పెట్టింది. 2026 నాటికి బహ్రెయిన్ ను గ్లోబల్ టూరిజం హబ్ గా మార్చే విధంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. మరో ఐదేళ్లలో 14.1 మిలియన్ల టూరిస్ట్ లను అట్రాక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం బహ్రెయన్ లో టూరిస్టుల సగటు ఖర్చు 74.8 దినార్ లు గా ఉంది. దీన్ని మరింత పెంచాలని..అదే విధంగా విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు ఇప్పుడున్న సగటును 3.5 రోజుల కన్నా ఎక్కువ రోజులు దేశంలో గడిపే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దేశ జీడీపీ లో టూరిజం కంట్రిబ్యూషన్ ను 2026 నాటికి 11.4 పర్సెంటేజ్ కు పెంచాలని ప్రభుత్వం గట్టిగా డిసెడైంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల్లో బహ్రెయిన్ టూరిజం కోసం ప్రమోషన్స్ చేపట్టనుంది. బహ్రెయిన్ ను ఎక్కువ విజిట్ చేయని దేశాల్లో ప్రమోషన్ చేస్తూ వారిని అట్రాక్ట్ చేయాలని నిర్ణయించింది. టూరిజం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com