యూఏఈ లో భారీ వర్షాలు... అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం సూచన
- November 09, 2021యూఏఈ: యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో సోమవారం వడగళ్ళతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో పర్వత ప్రాంతాలు, లోయలకు దూరంగా ఉండాలని దుబాయ్ పోలీసులు ప్రజలకు సూచించారు. తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరిక జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో "అస్థిర వాతావరణ పరిస్థితులు" ఉంటాయని NCM హెచ్చరించింది. చెట్లతో సహా బలహీనమైన నిర్మాణాలు ప్రమాదకరంగా మారవచ్చని, ప్రజలు వాటికి దూరంగా ఉండాలి అని NCM సూచించింది. ఫుజైరా, ఖోర్ ఫక్కన్, కల్బా, హట్టా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు