ట్విట్టర్‌ ద్వారా మరింత చేరువగా

- March 21, 2016 , by Maagulf
ట్విట్టర్‌ ద్వారా మరింత చేరువగా


యూఏఈ లీడర్స్‌, ఏజెన్సీస్‌ ట్విట్టర్‌ని మరింత బాగా వినియోగించుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించాయి. కొత్త చట్టాల్ని ప్రకటించడం, క్యాబినెట్‌ని రి-స్ట్రక్చర్‌ చేయడం, అలాగే ప్రజల్ని పలు అంశాలపై అప్రమత్తం చేయడం, యాక్సిడెంట్స్‌తోపాటు క్రైమ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం వంటివాటి కోసం ట్విట్టర్‌ని వేదికగా చేసుకోవాలని పాలకులు, ఏజెన్సీలు ఆలోచించాయి. యూఏఈ లీడర్స్‌, ప్రభుత్వ ఏజెన్సీలు ఇప్పటికే ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌ దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 10 లీడర్స్‌లో ఒకరిగా షేక్‌ మొహమ్మద్‌ ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ కేటగిరీలో ఉన్నారు.ప్రభుత్వ నిర్ణయాల్ని షేక్‌ మొహమ్మద్‌ ట్విట్టర్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజల అభిప్రాయాల్నీ స్వీకరిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ దుబాయ్‌ పోలీస్‌ కూడా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నాయి. దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌, రోడ్‌ క్లోజర్స్‌, బ్రిడ్జిల ప్రారంభం వంటి వాటి గురించిన సమాచారం అందిస్తోంది. నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిటియరాలజీ అండ్‌ సెస్మాలజీ ట్విట్టర్‌ ద్వారా వాతావరణ సంబంధిత విషయాలను తెలియజేస్తోంది. తద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com