యాక్సిడెంట్‌లో మృతిచెందిన చిన్నారికి కన్నీటి వీడ్కోలు

- March 21, 2016 , by Maagulf
యాక్సిడెంట్‌లో మృతిచెందిన చిన్నారికి కన్నీటి వీడ్కోలు



అల్‌ మెస్లియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఐదేళ్ళ చిన్నారి ఐదెన్‌ షాజి వర్గీస్‌కి భారతీయ వలసదారులు కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారం సాయంత్రం ఐదెన్‌ మృతదేహాన్ని అతని స్వస్థలమైన కేరళలోని పథనమ్‌తిట్ట జిల్లాలోగల తిరువాలాకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. సర్వోదయ కిండర్‌గార్టెన్‌లో చదువుతున్న ఐదెన్‌, స్కూల్‌ బస్సులో వెళుతుండగా, బస్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదెన్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో నలుగురు గాయాల పాలు కాగా, అందులో ఒకరికి ప్లాస్టిక్‌ సర్జరీ నిర్వహించారు. ఇంటి నుంచి మదినత్‌ ఖలీఫాలో గల స్కూల్‌కి వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కేరళ సోషల్‌ వెల్ఫేర్‌ మినిస్టర్‌ ఎంకె మునీర్‌, ఖతార్‌లో పర్యటించారు. గురువారం ఆయన ఐదెన్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఐదెన్‌ తండ్రి షాజి వర్గీస్‌ ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో పనిచేస్తున్నారు. ఐదెన్‌ తల్లి రీనా మాథ్యూ రుమైలా ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com