‘ఛత్రపతి’ రీమేక్ లో జానీ లివర్!
- November 09, 2021యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత సాయి శ్రీనివాస్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ మూవీని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు.
జానీ లివర్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ, ‘లెజండరీ యాక్టర్ జానీ లివర్ తో కలసి స్క్రీన్ ను షేర్ చేసుకునే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నానని,సెట్ లో జానీ లీవర్ కారణంగా చెప్పలేనంత ఎనర్జీ అందరిలోనూ ప్రవేశిస్తుంటుంద’ని బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ