భారత రాయబారి పవన్ కపూర్‌ పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు

- November 10, 2021 , by Maagulf
భారత రాయబారి పవన్ కపూర్‌ పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు

అబుధాబి: యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్‌ పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ తన కార్యాలయంలో పవన్ కపూర్‌ కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య బలమైన చారిత్రక సంబంధాలను గుర్తు చేశారు. భారత్-యూఏఈ సంబంధాలను పెంపొందించడంలో భారత రాయబారిగా కపూర్ చేసిన కృషిని, విశిష్ట సహకారాన్ని ప్రశంసించారు. తన పదవీ కాలం విజయవంతం అయ్యేందుకు సహకారం, మద్దతు అందించిన యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు భారత రాయబారి పవన్ కపూర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com