కరోనా ఆంక్షల సడలింపు. మసీదులలో మహిళలకు ప్రార్థన చేసుకునే అవకాశం
- November 10, 2021
యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మసీదుల్లో మహిళలకు ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఉమెన్స్ ప్రేయర్ హాల్స్ ను తిరిగి ఓపెన్ చేయనుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతేడాది జులైలో ఉమెన్స్ ప్రేయర్ హాల్స్ ను మూసివేశారు. ప్రేయర్ కు వచ్చే మహిళలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. మసీదులో 1.5 మీటర్ల డిస్టెన్స్ మెయింటెన్ చేయటంతో పాటు ప్రేయర్స్ కు ముందు, తర్వాత శానిటైజేషన్ చేసుకోవాలని తెలిపింది. కరోనా సేప్టీ మెజర్స్ పంప్లైట్స్ ను ఇంగ్లీష్, అరబ్, ఉర్దూ భాషల్లో అన్ని మసీదుల్లో అందుబాటులో ఉంచాలని కోరింది. ఇమామ్స్, మసీదుల్లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని నిబంధన పెట్టింది. ఇక ప్రార్థనలు పూర్తైన వెంటనే అన్ని మసీదుల్లో శానిటైజేషన్ చేస్తామని నేషనల్ క్రైసెస్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్