అబుధాబిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

- November 10, 2021 , by Maagulf
అబుధాబిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

యూఏఈ: అబుధాబిలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో బుధవారం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ వర్షాలు పడతాయని, దీని కారణంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మహ్మద్ బిన్ జాయెద్ సిటీలో తేలికపాటి వర్షం కురవగా.. సాదియత్ ద్వీపంలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రహదారిపై మోస్తరు నుండి భారీ వర్షం పడింది. అలాగే నగరంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న నివాసితులకు ఉపశమనం లభించింది. “పలు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది.  ముఖ్యంగా ద్వీపం, కొన్ని ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో మోస్తరు వర్షపాతం కురిసే అవకశం ఉంది. ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల నమోదు అవుతుంది. ” అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) తెలిపింది. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత రస్ అల్ ఖైమా విమానాశ్రయంలో మంగళవారం యూఏఈ స్థానిక కాలమానం ప్రకారం 12:00 గంటలకు 35°C గా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com