ట్రావెల్ ఎంట్రీ పాలసీని అప్డేట్ చేసిన బహ్రెయిన్

- November 11, 2021 , by Maagulf
ట్రావెల్ ఎంట్రీ పాలసీని అప్డేట్ చేసిన బహ్రెయిన్

బహ్రెయిన్: కరోనావైరస్ (COVID-19) వ్యాప్తిని అరికట్టేందుకు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ చేసిన సిఫార్సులను ప్రభుత్వ కార్యనిర్వాహక కమిటీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  పౌర విమానయాన వ్యవహారాలు (CAA) బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా వచ్చే వారి కోసం ట్రావెల్ ఎంట్రీ విధానాలను బహ్రెయిన్ అప్డేట్ చేసింది. మారిన కొత్త నిబంధనలు నవంబర్ 14 (ఆదివారం) నుండి అమల్లోకి రానున్నాయి.

 కొత్తగా అమల్లోకి రానున్న నిబంధనలు
1. కరోనా నేపథ్యంలో అమలు చేసిన ట్రావెల్ రెడ్ లీస్ట్ ను రద్దు చేశారు.
2. బహ్రెయిన్‌కు వచ్చే వ్యాక్సిన్ వేసుకోని ప్రయాణీకులందరూ నిర్ణీత నిర్బంధ కేంద్రాల వద్ద కాకుండా వారి నివాస స్థలంలోనే క్వారంటైన్ లో ఉండొచ్చు.  

వీటితోపాటు CAA ప్రస్తుతం అమలు చేస్తున్న ముందుజాగ్రత్త ఆరోగ్య చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బహ్రెయిన్‌కు సంబంధించిన ట్రావెల్ ఎంట్రీ విధానాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్: healthalert.gov.bh లో చూడవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com