అత్యవసర వినియోగానికి కోవాగ్జిన్ వ్యాక్సిన్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్
- November 12, 2021
బహ్రెయిన్: భారతీయ బయోటెక్నాలజీ కంపెనీ "భారత్ బయోటెక్" ఉత్పత్తి చేస్తున్న COVID-19 వ్యాక్సిన్ COVAXIN అత్యవసర వినియోగాన్ని బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) ఈ రోజు ఆమోదించింది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఆమోదించిన నేపథ్యంలో బహ్రెయిన్ కూడా వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెలిపింది. 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని NHRA స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ అందించిన డేటాను NHRA క్లినికల్ ట్రయల్స్ కమిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇమ్యునైజేషన్ కమిటీ జాగ్రత్తగా మూల్యాంకనం చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోనబడిందని తెలిపింది. 26,000 మందికి పైగా ప్రజలపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. రెండు-డోస్ రెజిమెన్ వ్యాక్సిన్ COVID-19కి వ్యతిరేకంగా 77.8% ప్రభావవంతంగా ఉందని, COVID-19 తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా 93.4% ప్రభావవంతంగా ఉందని క్లినికల్ డేటాలో వెల్లడైందని NHRA తెలిపింది.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









