బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
- November 13, 2021
నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

చిత్ర యూనిట్ మొత్తం లాంచ్‌కి హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ క్లాప్ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా సినిమా స్క్రిప్ట్‌ని టీమ్‌కి అందజేశారు. జనవరి 2022లో రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీత దర్శకుడు. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కొంత భాగాన్ని అమెరికాలో చిత్రీకరించనున్నారు. గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'జై బాలయ్య' అనే టైటిల్ ఖరారు చేయగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









