మొబైల్‌ టూరిజం స్టేషన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

- March 21, 2016 , by Maagulf
మొబైల్‌ టూరిజం స్టేషన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

ఖరీఫ్‌ టూరిస్ట్‌ సీజన్‌లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం మొబైల్‌ టూరిజం స్టేషన్‌ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. స్మాల్‌ అండ్‌ మీడియమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎస్‌ఎంఇ)కు సపోర్ట్‌గా ఉండేందుకోసం మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం ఈ ప్రాజెక్ట్‌ని తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా దేశంలో టూరిజం రంగం అభివృద్ధి చెందుతుందని మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం వర్గాలు వెల్లఇంచాయి. దోఫార్‌ డిప్యూటీ గవర్నర్‌ అబ్దుల్లా బిన్‌ అకీల్‌ అల్‌ ఇబ్రహీమ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సలాహ్‌ మెథనాల్‌ ఆర్థిక సహకారంతో, రియాదా (పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ ఎస్‌ఎంఇ డెవలప్‌మెంట్‌), అల్‌ రఫ్‌ద్‌ ఫండ్‌, సలాహ్‌ పోర్ట్‌, దోఫార్‌ మున్సిపాలిటీ మరియు హ్యాండిక్రాఫ్ట్స్‌ ఇండస్ట్రీస్‌ ఇన్‌ దోఫార్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సలాహ్‌లో మొత్తం ఏడు మొబైల్‌ టూరిజం స్టేషన్స్‌ ఉంటాయి. వీటిల్లో రెండు ఫుడ్‌ మరియు బెవరేజెస్‌ని సప్లయ్‌ చేస్తాయి. మరో రెండు స్టేషన్స్‌లో సంప్రదాయ హ్యాండిక్రాఫ్ట్స్‌ని ప్రదర్శించడం, మరియు అమ్మకం చేపడ్తాయి. రెండు స్టేషన్స్‌ రిఫ్రెష్‌మెంట్స్‌ని, ఒక స్టేషన్‌ టూరిజం సర్వీసెస్‌ మరియు సమాచారాన్ని అందిస్తుంది. లోకల్‌ ఎకానమీని పెంచడం, అలాగే ఎంప్లాయీస్‌ మరియు ఎస్‌ఎంఇ ఓనర్స్‌కి ప్రాక్టికల్‌ మరియు టెక్నికల్‌ ట్రెయినింగ్‌ అందించేలా తీర్చిదిద్దబడింది ఈ ప్రోగ్రామ్‌. సీజనల్‌గా ఈ స్టేషన్స్‌ని నిర్వహిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com