కరోనా ఎమర్జెన్సీ డ్రగ్ గా ఇవుషెల్డ్. అనుమతిచ్చిన ఫస్ట్ కంట్రీ బహ్రెయిన్

- November 15, 2021 , by Maagulf
కరోనా ఎమర్జెన్సీ డ్రగ్ గా ఇవుషెల్డ్. అనుమతిచ్చిన ఫస్ట్ కంట్రీ బహ్రెయిన్

బహ్రెయిన్ : కరోనా ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం ఇవుషెల్డ్ డ్రగ్ ను వాడేందుకు బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ డ్రగ్ ను ఎమర్జెన్సీ యూసేజ్ గా అనుమతించిన ఫస్ట్ కంట్రీగా బహ్రెయిన్ నిలిచింది. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరికైతే కరోనా కారణంగా ప్రాణపాయం ఉంటుందో వారి ట్రీట్ మెంట్ లో ఈ డ్రగ్ ను వాడనున్నారు. ఈ డ్రగ్ ను ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేసింది. డ్రగ్ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆస్ట్రాజెనికా ఇచ్చిన డేటా ఆధారంగా ఇవుషెల్డ్ వాడకానికి అనుమతించారు. ఇవుషెల్డ్ ను రెండు రకాల యాంటీ బాడీలను మిక్స్ చేసి రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com