తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలిచిన కాశీ విశ్వనాథ్
- November 15, 2021
హైదరాబాద్: నవంబర్ 14వ తేదీ ఆదివారం తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి.ఇందులో దర్శకుడు కాశీ విశ్వనాథ్ కు చెందిన ప్యానెల్ జయకేతనం ఎగురవేసింది. అత్యధిక మంది సభ్యులు ఆయన ప్యానెల్ నుండి ఎన్నిక కావడం విశేషం.ఇక సముద్ర, చంద్రమహేశ్ ప్యానెల్స్ నుండి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు.మహిళా రిజర్వేషన్ కోటాలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వి.ఎన్. ఆదిత్య, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మేర్లపాక గాంధీ, జీ.ఎస్. రావు; సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు; కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లా బక్ష్, పి. వి. రమేశ్ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ.ప్రేమ్ రాజ్, నీలం సాయి రాజేశ్, ఎం. సాయి సురేంద్ర బాబు, కూరపాటి రామారావు ఎన్నికయ్యారు.మహిళల కేటగిరిలో సౌజన్య, ప్రవీణలను ఎంపిక చేశారు. ఈ నూతన కార్యవర్గం ఈ నెల 18న ప్రమాణస్వీకారం చేయనుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్