ఈ స్మార్ట్ టీవీ యాప్‌ ఉందా?అయితే జాగ్రత్త..

- November 15, 2021 , by Maagulf
ఈ స్మార్ట్ టీవీ యాప్‌ ఉందా?అయితే జాగ్రత్త..

గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవల తన ప్లాట్‌ఫారమ్ నుండి రెండు ప్రమాదకరమైన యాప్‌లను నిషేధించింది.ప్లే స్టోర్‌లో అంతా తరచుగా వెతికే యాప్ అందులో ఒకటి. తెలిస్తే మీరు షాక్ అవుతారు. గూగుల్ తాజాగా రెండు యాప్స్‌ను తొలిగించింది.ఇందులో స్మార్ట్ టీవీ రిమోట్.. హాలోవీన్ కలరింగ్. రెండు యాప్‌ల (APPS) పేర్లను Kaspersky సెక్యూరిటీ అనలిస్ట్ వెల్లడించారు. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం,ఈ యాప్‌లలో జోకర్ మాల్వేర్ ఉంటుంది.

జోకర్ మాల్వేర్ ఒక ప్రమాదకరమైన మాల్వేర్. ఇది వినియోగదారులకు తెలియకుండానే ప్రీమియం కంటెంట్‌కు సభ్యత్వాన్ని పొందుతుంది. రిసోర్స్ / అసెట్ / kup3x4nowz ఫైల్ స్మార్ట్ టీవీ రిమోట్ యాప్‌లో దాచబడిందని  q7y4prmugi అనే ఫైల్ హాలోవీన్ కలరింగ్ యాప్‌లో సీక్రెట్‌గా ఉంచారని దర్యాప్తులో తేలింది. యాప్‌లలో దాగి ఉన్న ప్రమాదకరమైన ఫైల్‌లు ఏ యాంటీవైరస్ ద్వారా గుర్తించబడని విధంగా ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.

మీరు ‘స్మార్ట్ టీవీ రిమోట్’ తోపాటు ‘హాలోవీన్ కలరింగ్’ నుండి ఏదైనా యాప్‌లను డౌన్‌లోడ్ చేసి లేదా ఉపయోగించినట్లయితే మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్ నుండి ఈ యాప్‌లను త్వరగా తీసివేయాలి. మీ అనుమతి లేకుండా ఈ అప్లికేషన్‌లు ఏదైనా ప్రీమియం కంటెంట్ కోసం సైన్ అప్ చేయలేదని మీరు తనిఖీ చేయాలి.

ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి...
1. మీరు డౌన్‌లోడ్ చేయని యాప్‌లు ఏవైనా ఉన్నాయో లేదో చూడటానికి మీ ఫోన్‌ని తనిఖీ చేయండి. అలాంటి యాప్ కనిపిస్తే వెంటనే దాన్ని తీసివేయండి.

2. ఒక యాప్ తనకు అవసరమైన దానికంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నట్లయితే అలాంటి యాప్‌లను కూడా తీసివేయండి.

3. కొత్త యాప్‌ని డౌన్‌లోడ్ చేసే ముందు వారి రివ్యూలను తప్పకుండా చదవండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com