ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్‌ అక్కర్లేదు..

- November 15, 2021 , by Maagulf
ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్‌ అక్కర్లేదు..

న్యూ ఢిల్లీ: ఎన్నారైలకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.అంతార్జతీయ ప్రయాణికులపై ఉన్న క్వారంటైన్‌ నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చింది.భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. లిస్ట్‌ ఏలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.దీంతో క్వారెంటైన్‌ భయాలు తొలగిపోయాయి.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కి సంబంధించి 99 దేశాలతో భారత్‌ అవగాహన కుదుర్చుకుంది.ఈ దేశాల్లో డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన వ్యాక్సిన్లు అందిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకు‍న్న వారు ఎయిర్‌ సువిధా పోర్టల్‌లో తమ వ్యాక్సినేషన్‌కి సంబంధించిన రిపోర్టుని అప్‌లోడ్‌ చేయాలి.దీంతో పాటు ప్రయాణానికి 72 గంటల ముందు జారీ చేసిన కోవిడ్‌ నెగటీవ్‌ రిపోర్టకు కూడా జత చేయాలి.ఈ రెండు పనులు చేసిన ప్రయాణికులు ఇండియా వచ్చిన తర్వాత 14 రోజుల నిర్బంధ క్వారంటైన్‌ ఉండక్కర్లేదు.

లిస్ట్‌లో 99 దేశాల జాబితాలో విదేశీ ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అమెరికా,ఆస్ట్రేలియా,యూకే,ఫ్రాన్స్‌,జర్మనీ,యూఏఈ,ఒమన్,కువైట్,బహ్రెయిన్,ఖతర్‌ తదితర దేశాలు ఉన్నాయి.తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటు ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు.అయితే ప్రయాణం సందర్భంగా కోవిడ్‌ రూల్స్‌ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.అక్టోబరు 15 నుంచే విదేశీ ప్రయాణికులను ఇండియాలోకి అనుమతి ఇస్తున్నారు.అయితే అప్పుడు కేవలం ఛార్టెడ్‌ ఫ్లైట్లకే అనుమతి ఇచ్చారు.కాగా ఇప్పుడు కమర్షియల్‌ విమానాలకు పచ్చజెండా ఊపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com