వచ్చే ఏడాది ప్రపంచ కప్ జరిగే వేదికల వివరాలు...
- November 16, 2021
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐకి ఉన్న కరోనా కారణంగా దానిని యూఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది.ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.కాబట్టి ఇప్పుడు అందరూ దాని వైపు చూస్తున్నారు.ఇక తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టీ20 ప్రపంచ కప్ 2022 నిర్వహించే వేదికలను ప్రకటించింది.ఈ ప్రపంచ కప్ లో జరగనున్న 45 మ్యాచ్ లు మొత్తం అడిలైడ్, బ్రిస్బేన్,గీలాంగ్,హోబర్ట్,మెల్బోర్న్,పెర్త్ మరియు సిడ్నీ వేదికలుగా జరుగుతాయి.ఈ టోర్నమెంట్ అక్టోబర్ 16న ప్రారంభమై నవంబర్ 13న మెల్బోర్న్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.అయితే నవంబర్ 9,10 తేదీల్లో ఈ టోర్నీ యొక్క సెమీ ఫైనల్ మ్యాచ్ లు సిడ్నీ మరియు అడిలైడ్ వేదికగా జరుగుతాయి.ఇక ఈ టోర్నీ కోసం ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి 8 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్,ఇండియా,పాకిస్థాన్ మరియు దక్షిణాఫ్రికా జట్లు నేరుగా సూపర్ 12 దశలోకి అర్హత సాధించాయి.మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్లు జరుగుతాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్