హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
- November 16, 2021తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు… తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్నారు హీరో విజయ్.
సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు హీరో విజయ్. అయితే తాజాగా హీరో విజయ్ ఇంట్లో బాంబు అనే వార్త కలకలం రేపుతోంది.
విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెన్నై నగర పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో శనివారం అర్ధరాత్రి నీలంగారైల్లోని… ఆయన ఇంట్లో పాలు నిర్వహించారు పోలీసులు. నీలంగారై పోలీసులు బాంబు స్క్వాడ్ కలిసి తనిఖీ చేశారు. అయితే ఈ తనిఖీల్లో బాంబు ఎక్కడ దొరకలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విచారణ లో విల్లుపురం జిల్లా.. మరక్కణం గ్రామానికి చెందిన భువనేశ్వర్ అనే మతిస్థిమితం లేని యువకుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. అతను గతంలో కూడా పలువురు రాజకీయ అలాగే సినీప్రముఖుల ఇళ్లలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ చేశాడని విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు