దుబాయ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వద్ద కెమెరాలు
- March 22, 2016
దుబాయ్ మునిసిపాలిటీ ఇకపై కన్స్ట్రక్షన్ సైట్స్ వద్ద సర్వైలెన్స్ కెమెరాలను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. టవర్ క్రేన్లపై ఈ కెమెరాలను వినియోగించవలసి ఉంటుంది. మొత్తం సైట్ అంతా ఈ కెమెరాల ద్వారా వీక్షించేలా ఉండాలి. సర్కులర్ నెంబర్ 211, 2016 ప్రకారం ఈ కొత్త ఆదేశాలను జారీ చేశారు. నాలుగు కెమెరాలకు తక్కువ కాకుండా కన్స్ట్రక్షన్స్ సైట్ వద్ద కెమెరాలను వినియోగించడం తప్పనిసరి. 'భద్రతతో కూడిన పని'లో భాగంగా ఈ చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. దుబాయ్‌లో ప్రస్తుతం 53.6 బిలియన్ డాలర్ల విలువైన కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. క్రేన్ ఆపరేటర్స్‌కి కిందనున్న పనివారికీ మధ్య కమ్యూనికేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించడం భద్రతా చర్యల్లో ముఖ్య భాగం. అలాగే రహదార్లపై ట్యాక్సీలు, ఇతర వాహనాలలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలకు కారణాల్ని విశ్లేషించడానికి వీలవుతోంది. అలాగే దొంగతనాలూ తగ్గుతున్నాయి. ఈ చర్యలను ఇప్పటికే దుబాయ్ మునిసిపాలిటీ తీసుకుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







