ఘనంగా హీరో కార్తికేయ పెళ్లి..
- November 21, 2021
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడు అయ్యాడు. ఆదివారం ఉదయం 9 గంటల 47 నిమిషాలకు తాను ప్రేమించిన అమ్మాయి లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి వివాహా వేడుక జరిగింది. ఈ వేడకకు సినీ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అజయ్ భూపతి, తణికెళ్ల భరణి, పాయల్ రాజ్పుత్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్తికేయ పెళ్లి ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్లో హీరోగా మారాడు కార్తీకేయ. పాయల్ రాజ్పుత్ కథానాయికగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీంతో వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు కార్తీకేయ. ఇటీవల ఆయన నటించిన చిత్రం 'రాజా విక్రమార్క' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది. బీటెక్ చదివే రోజుల్లో కార్తికేయకు లోహిత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న వీరు నేడు పెళ్లితో ఒక్కటైయ్యారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!