నాలుగవ స్మార్ట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన బిహెచ్‌బి

- November 22, 2021 , by Maagulf
నాలుగవ స్మార్ట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన బిహెచ్‌బి

మనామా: బహ్రెయిన్ బౌర్స్ నాలుగవ ఎడిషన్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రోగ్రామ్‌ని 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన కరికులమ్‌లో భాగంగా అధికారికంగా ప్రకటించింది. 70 స్కూళ్ళలో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన వర్క్ షాపులు నడుస్తాయి. 5000 మందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. బహ్రెయిన్ బౌర్స్ సీఈఓ షేక్ ఖలీఫా బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని చేపడుతుండడం ఆనందంగా వుందని అన్నారు. 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువ విద్యార్థులకు మనీ మేనేజ్మెంట్, సేవింగ్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి విభాగాల్లో అవగాహన ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com