బహ్రెయిన్ గవర్నరేట్లలో 1,410 కారు పార్క్స్ ఏర్పాటు
- November 23, 2021మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ విజయవంతంగా బహ్రెయిన్‌లోని పలు గవర్నరేట్లలోగల రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లో కార్ పార్క్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1,410 కార్ పార్క్‌లను దేశవ్యాప్తంగా 282,000 బహ్రెయినీ దినార్లతో ఏర్పాటు చేశారు. 310 కార్ పార్క్‌లను క్యాపిటల్ గవర్నరేటులో ఏర్పాటు చేయడం జరిగింది. ముహరాక్లో 300, నార్తరన్ గవర్నరేట్ 510, సౌత్ గవర్నరేటులో 290 ఏర్పాటు చేశారు. గత ఏడాది 1,730 కార్ పార్కులను నాలుగు గవర్నరేట్లకు కేటాయించారు. కాగా, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సహకారంతో మినిస్ట్రీ, రెసిడెన్షియల్ ఏరియాల్లోని పార్కింగ్ మీటర్ల నుంచి ఫీజు మినహాయింపు దిశగా ఆలోచన చేస్తోంది. రెసిడెంట్స్ కోసం ప్రత్యేకంగా స్టిక్కర్లు ఏర్పాటు చేసి మినహాయింపులు ఇస్తారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం