బయోమెట్రిక్ నిబంధనల ఉల్లంఘన... 207 మంది ఉద్యోగులకు నో సాలరీ
- November 25, 2021
కువైట్: బయోమెట్రిక్ హాజరు నిబంధనలను పాటించనందుకు సమాచార మంత్రిత్వ శాఖ 207 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా నిలిపివేసింది. సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) జారీ చేసిన సూచనల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉద్యోగుల్లో నిబద్ధత లేకపోవడం, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థకు విఘాతం కలిగించడం లాంటి చర్యలను మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో గుర్తించారు. ఈ గందరగోళం కారణంగా ఉద్యోగుల్లో విభేదాలు తలెత్తాయి. ఈ కారణంగా CSC సమన్వయంతో జీతాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను పాటించాల్సిందేనని రెగ్యులేటరీ అధికారుల చేసిన సిఫార్సుల కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు సిస్టంను CSCతో అనుసంధానించలేదని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారని...ఆ కారణంగానే లేటుగా వస్తున్నారని అధికారులు గుర్తించారు. కానీ CSCతో బయోమెట్రిక్ అనుసంధానం ఎప్పుడు జరిగిపోయిందని ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని అధికారులు కోరారు. అటు కొందరు ఉన్నత ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ నివేదికలో తెలిపినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారిపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!