బయోమెట్రిక్ నిబంధనల ఉల్లంఘన... 207 మంది ఉద్యోగులకు నో సాలరీ

- November 25, 2021 , by Maagulf
బయోమెట్రిక్ నిబంధనల ఉల్లంఘన... 207 మంది ఉద్యోగులకు నో సాలరీ

కువైట్: బయోమెట్రిక్ హాజరు నిబంధనలను పాటించనందుకు సమాచార మంత్రిత్వ శాఖ 207 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా నిలిపివేసింది. సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) జారీ చేసిన సూచనల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉద్యోగుల్లో నిబద్ధత లేకపోవడం, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థకు విఘాతం కలిగించడం లాంటి చర్యలను మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో గుర్తించారు. ఈ గందరగోళం కారణంగా ఉద్యోగుల్లో విభేదాలు తలెత్తాయి. ఈ కారణంగా CSC సమన్వయంతో జీతాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఉద్యోగులు కచ్చితంగా  బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను పాటించాల్సిందేనని రెగ్యులేటరీ అధికారుల చేసిన  సిఫార్సుల కారణంగానే  ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు సిస్టంను  CSCతో అనుసంధానించలేదని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారని...ఆ కారణంగానే లేటుగా వస్తున్నారని అధికారులు గుర్తించారు. కానీ CSCతో బయోమెట్రిక్ అనుసంధానం ఎప్పుడు జరిగిపోయిందని ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని అధికారులు కోరారు. అటు కొందరు ఉన్నత ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ నివేదికలో తెలిపినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారిపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com