చట్టాలు ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్
- November 25, 2021
ఒమన్: ఒమన్ లో ఉంటున్న చాలా మంది ప్రవాసులు ఇక్కడి లేబర్ అండ్ రెసిడెన్షియల్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ లెక్క చేయటం లేదు. ఇప్పటికే పలుమార్లు చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే 11 మంది ఆఫ్రికన్లు అక్రమంగా దేశంలోకి చొరబడితే వారిని అరెస్ట్ చేశారు. తాజాగా రాయల్ ఒమన్ పోలీసులు మరో 17 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. వీరంతా లేబర్ అండ్ రెసిడెన్షియల్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడినట్లు అల్ బురామి గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అరెస్టైన వారిలో ఆఫ్రికన్ దేశాల వారితో పాటు ఏషియన్స్ కూడా ఉన్నారు. ఇక మరో ఇద్దరు ఏషియన్స్ డ్రగ్స్ అమ్ముతుండగా వారిని పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 2.5 కిలోల క్రిస్టల్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!