ఇండియన్ మిలిటరీ అకాడమిలో ఉద్యోగాలు..
- November 25, 2021ఇండియన్ మిలిటరీ అకాడమి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో పలు విభాగాల్లో మొత్తం 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా కుక్, ఎంటీ డ్రైవర్, బుక్ మేకర్/రిపెయిరర్, ఎల్డీసీ, మసాల్చి, వెయిటర్, ఫాటిగ్యూమెన్, ఎంటీఎస్(సఫాయివాలా), గ్రౌండ్స్‌మెన్, జీసీ ఆర్డర్లీ, ల్యాబొరేటరీ అటెండెంట్, బార్బర్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో నైపుణ్యం ఉండాలి. వీటితో పాటు పని అనుభవం తప్పనిసరి.
- అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను ఇండియన్ మిలిటరీ అకాడమి(ఐఎంఏ), డెహ్రాడూన్ చిరునామకు పంపించాలి.
- అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
- రాత పరీక్షను 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ప్రశ్న పత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది.
- దరఖాస్తుల స్వీకరణకు 14-01-2022
పూర్తి వివరాలకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు