టూరిస్ట్ వీసా పై కువైట్ కీలక నిర్ణయం..

- November 25, 2021 , by Maagulf
టూరిస్ట్ వీసా పై కువైట్ కీలక నిర్ణయం..

కువైట్ సిటీ: టూరిస్ట్ వీసా జారీ విషయమై కువైట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జీసీసీ దేశాలలోని విదేశీ నివాసులతో పాటు మరో 53 దేశాల వారికి మాత్రమే టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు భారత పౌరులకు మాత్రం అవకాశం లేదు. ఇక టూరిస్ట్ ఈ-వీసా, ఆన్‌లైన్ చెల్లింపుల కోసం మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను జత చేసినట్లు  అధికారులు వెల్లడించారు. జీసీసీ దేశాల్లో( యూఏఈ,సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్,ఒమన్, కువైట్) ఆరు నెలల కంటే ఎక్కువ నివాసం ఉన్న ప్రవాసులతో పాటు 2008లో తీసుకువచ్చిన మంత్రివర్గ తీర్మానం నం. 220  ప్రకారం ప్రత్యేక వృత్తులు కలిగిన వారు టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

మంత్రివర్గ తీర్మానం ప్రకారం జీసీసీ దేశాల్లోని ఈ క్రింది వృత్తులవారు టూరిస్ట్ ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.కన్సల్టెంట్స్, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, జడ్జిలు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులు, యూనివర్శిటీ అధ్యాపకులు, ప్రెస్ అండ్ మీడియా సిబ్బంది, పైలట్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, సీస్టం అనలిస్ట్స్, మేనేజర్స్, వ్యాపారవేత్తలు, దౌత్య దళం, యూనివర్శిటీ గ్రాడ్యుయేట్స్, సౌదీ ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు.

పర్యాటక ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్న 53 దేశాల వివరాలు..

1.అన్డోరా

2.ఆస్ట్రేలియా

3.ఆస్ట్రియా

4.బెల్జియం

5.భూటాన్

6.బ్రూనై

7.బల్గేరియా

8.కంబోడియా

9.కెనడా

10.క్రోఅతియా

11.సైప్రస్

12.చెక్

13.డెన్మార్క్

14.ఎస్టోనియా

15.ఫిన్లాండ్

16.ఫ్రాన్స్

17.జార్జియా

18.జర్మనీ

19.గ్రీస్

20.హన్గేరి

21.ఐస్లాండ్

22.ఐర్లాండ్

23.ఇటలీ

24.జపాన్

25.లాఓస్

26.లాట్వియా

27.లైచ్టెన్స్టెయిన్

28.లిథుయేనియా

29.లక్సెంబోర్గ్

30.మలేషియా

31.మాల్టా

32.మొనాకో

33.నెథర్లాండ్స్

34.న్యూ జీలాండ్

35.నార్వే

36.పోలాండ్

37.పోర్చుగల్

38.రోమానియా

39.సన్ మారినో

40.సెర్బియా

41.సింగపూర్

42.స్లోవేకియా

43.స్లోవేనియా

44.సౌత్ కొరియా

45.స్పెయిన్

46.స్వీడన్

47.స్విట్జర్లాండ్

48.ది పీపుల్స్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్  చైనా–హాంగ్ కాంగ్

49.టర్కీ

50.యుక్రెయిన్

51.యునైటెడ్  కింగ్డమ్

52.యునైటెడ్ స్టేట్స్,53.వాటికన్ 

        మార్గదర్శకాలు..

  • దేశంలోకి ప్రవేశించిన వెంటనే ఎంట్రీ పాయింట్ వద్ద వీసా ఫీజుగా 3KD చెల్లించాలి.
  • ఈ-వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు పాస్‌పోర్ట్ చెల్లుబాటు ఆరు నెలల కంటే ఎక్కువ ఉండాలి.
  • ఒక టూరిస్ట్ వీసా కువైత్‌లోకి ఒక్క ఎంట్రీ కోసం మాత్రమే జారీ చేయబడుతుంది.అది కూడా ఒక నెల గడవుతో మాత్రమే. 
  • టూరిస్ట్ వీసా కలిగిన వారు ఎంట్రీ తేదీ నుంచి తాత్కాలికంగా మూడు నెలల వరకు కువైత్‌లో నివాసం ఉండొచ్చు. అలాగే గడువు ముగియడానికి ముందే వీసాదారు దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
  • టూరిస్ట్ వీసా హోల్డర్ దేశంలో పని చేయడానికి అనుమతి ఉండదు. ఒకవేళ వీసాదారు ఈ నియమాన్ని ఉల్లంఘించి పట్టుబడితే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.
  • అనుమతించబడిన వ్యవధిని దాటిన సందర్శకుడికి జరిమానా విధిస్తారు. అలాగే చట్టపరమైన జవాబుదారీతనానికి లోబడి భవిష్యత్తులో వీసా జారీ చేయకుండా అతడు/ఆమెను అనర్హులుగా ప్రకటిస్తారు.
  • సమర్పించిన దరఖాస్తులను అధికారిక పని దినాలలో పని గంటలలోపు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇందులో కువైట్ వారాంతాలు (శుక్ర, శనివారం), ప్రభుత్వ సెలవులు ఉండవు.
  • పర్యాటక ఈ-వీసా దరఖాస్తు స్టేటస్‌(ఆమోదించబడిన లేదా తిరస్కరించబడిన)ను ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.                                                                                                                                                                                                                                    --దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com