ఇండియన్ మిలిటరీ అకాడమిలో ఉద్యోగాలు..
- November 25, 2021
ఇండియన్ మిలిటరీ అకాడమి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో పలు విభాగాల్లో మొత్తం 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్‌లో భాగంగా కుక్, ఎంటీ డ్రైవర్, బుక్ మేకర్/రిపెయిరర్, ఎల్‌డీసీ, మసాల్చి, వెయిటర్, ఫాటిగ్యూమెన్, ఎంటీఎస్(సఫాయివాలా), గ్రౌండ్స్‌మెన్, జీసీ ఆర్డర్లీ, ల్యాబొరేటరీ అటెండెంట్, బార్బర్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో నైపుణ్యం ఉండాలి. వీటితో పాటు పని అనుభవం తప్పనిసరి.
- అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను ఇండియన్ మిలిటరీ అకాడమి(ఐఎంఏ), డెహ్రాడూన్ చిరునామకు పంపించాలి.
- అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
- రాత పరీక్షను 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ప్రశ్న పత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది.
- దరఖాస్తుల స్వీకరణకు 14-01-2022
పూర్తి వివరాలకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://joinindianarmy.nic.in/Authentication.aspx
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!