స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించేలా మేడ్ ఇన్ ఒమన్ ప్రారంభం

- November 25, 2021 , by Maagulf
స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించేలా మేడ్ ఇన్ ఒమన్ ప్రారంభం

మస్కట్: ఒమన్ ఉత్పత్తులకు మద్దతుగా మేడ్ ఇన్ ఒమన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీస్ పబ్లిక్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మరియు స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్, డెవలప్‌మెంట్ అధారిటీ అలాగే పలు కమర్షియల్ కేంద్రాల సహకారంతో ఈ క్యాంపయిన్ ప్రారంభించారు. ఒమనీ తయారీదారులకు వ్యాపార పరంగా మెరుగైన అవకాశాల్ని కల్పించడం వాటికి ప్రోత్సాహకాలు అందించడం, ప్రచారం కల్పించడం ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com