సోమాలియాలో భారీ పేలుడు
- November 25, 2021
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఐరాస భద్రతా సిబ్బంది కాన్వారులో భారీ పేలుడు జరిగింది.ఈ పేలుడు ఘటనలో ఎనిమిది మంది మరణించగా, 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సిబ్బంది లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున ఎస్యువి వాహనం నిండా పేలుడు పదార్థాలతో సూసైడ్ బాంబర్ దాడి జరిపినట్లు పోలీసుల ప్రతినిధి అబ్దిఫత్ అడెన్ హసన్ తెలిపారు. మొగదిషులోని కె4 జంక్షన్ సమీపంలో పేలుడు జరిగిందని, అనంతరం కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కె4 జంక్షన్ సమీపంలోనే ముకస్సర్ ప్రాథమిక, సెకండరీ పాఠశాల, ఆస్పత్రి ఉన్నాయని అన్నారు. పేలుడు దాటికి పాఠశాల, ఆస్పత్రి కూలిపోయాయని, వివరాలు తెలియదని అన్నారు. అలాగే ఈ దాడిలో ఐక్యరాజ్యసమితి సిబ్బందిలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారు… అనే అంశంపై స్పష్టత లేదని, స్పందించేందుకు యుఎన్ అధికారులు నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు అల్-షబాబ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!