తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలు..

- November 25, 2021 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలు..

అమెరికా తెలుగు సంఘం(ATA) వేడుకలు డిసెంబర్ 5 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 24 వరకూ జరిగే ఈ వేడుకల్లో భాగంగా ‘ఆటా’.. వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులను నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలు ఈ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిసెంబర్ 26న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే గ్రాండ్ ఫినాలేతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా.. ‘ఆటా’ నిర్వహకులు వివిధ దేశాల్లోని తెలుగు వారిని ఆహ్వానించారు. డిసెంబర్‌లో భారత్‌కు ప్రయాణం పెట్టుకున్న ఎన్నారైలు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ​​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com